ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం

ELR: నూజివీడు మండలం మద్దాయి కుంట జడ్పీ హైస్కూల్‌లో గురువారం ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం దారపు రెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. విద్యార్థులలో మాతృభాషా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. శ్రీ నాథుడు, వేమన, శ్రీశ్రీ, జాషువా వంటి కవులు భాషకు చేసిన సేవను వివరించారు. పూర్వ విద్యార్థి ఆర్మూరు గోవింద్ పాఠశాలకు వార్తా పత్రికలను అందించారు.