మునిగిన కనకాయలంక కాజ్ వే

మునిగిన కనకాయలంక కాజ్ వే

W.G: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం యలమంచిలి మండలంలోని కనకాయ లంక కాజ్ వే నీటిలో మునిగింది. దీంతో కనకాయలంక నుంచి కోనసీమ జిల్లా వైపు ఉన్న చాకలిపాలెం, రాజోలు జగ్గన్నపేట, తదితర గ్రామాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు రాకపోకలకు మర పడవలపై వెళుతున్నారు.