రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించిన MP

రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించిన MP

MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్‌ను MP గడ్డం వంశీకృష్ణ మంగళవారం సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రతి పని సమయానికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునిక సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.