వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

KNR: నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు తొందరగా ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, వన్ టౌన్ ఏరియా, నగరంలో ప్రధాన నాళాలు ప్రవహించే ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.