VIDEO: ఖాళీ అవుతున్న మద్ది గుండం చెరువు

NDL: గత రాత్రి కురిసిన భారీ వర్షంతో మద్ది గుండం చెరువుకు గండి పడింది. నీటి ప్రవాహాన్ని అధికారులు అడ్డుకోలేకపోయారు. దీంతో చెరువు ఖాళీ అవుతుంది. రైతుల పంట పొలాలకు అందాల్సిన నీరు వృథాగా పోతోంది. మంగళవారం చెరువు ఖాళీ అవుతున్న దృశ్యం చూసి అధికారులు, రైతులు అయోమయంలో ఉన్నారు. నీటి వృథాను అపేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.