క్షణికావేశంలో తండ్రినే హతమార్చిన కొడుకు

క్షణికావేశంలో తండ్రినే హతమార్చిన కొడుకు

VZM: క్షణికావేశంలో కసాయి కొడుకు కన్నతండ్రినే హతమార్చాడు. తెర్లాం మండలం ఎంఆర్ అగ్రహారానికి చెందిన అప్పలస్వామి(70) తన గురించి తప్పుగా చెబుతున్నాడని కొడుకు శంకరరావు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కోపంతో రాయితో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అప్పలస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనవరాలు కల్పన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.