కేంద్రంపై ఖర్గే తీవ్ర విమర్శలు

కేంద్రంపై ఖర్గే తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు అర్థరహితమని, దేశంలో నిరుద్యోగం, అప్పులు పెరిగాయని ఆరోపించారు. పట్టభద్రుల్లో కేవలం 54.8 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయని, వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు. ప్రజల పొదుపు తగ్గి అప్పులు పెరిగాయని మండిపడ్డారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో కేంద్రం విఫలమయ్యిందని అభిప్రాయపడ్డారు.