మంత్రితో చింతలపూడి ఎమ్మెల్యే భేటీ
ELR: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారని అన్నారు.