నేడు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇంఛార్జి దయాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, పెరికాసింగారం, తిరుమలయపాలెం మండలం మాదిరిపురంలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు.