రైలు నుంచి జారిపడి తండ్రి, కూతురికి గాయాలు
E.G: రైలు నుంచి జారిపడి తండ్రి, కూతురు గాయపడిన ఘటన నిడదవోలులో చోటుచేసుకుంది. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తున్న ఓ కుటుంబ.. నిడదవోలు రైల్వే స్టేషన్‌లో నీళ్ల బాటిల్ తీసుకునేందుక రైలు దిగారు. రైలు కదలడంతో ఎక్కడానికి ప్రయత్నించి.. తండ్రి, కూతురు జారి పడ్డారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.