'జగన్ పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి'

అన్నమయ్య: YS జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి జిల్లా రామగిరిలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థను, మహిళా పోలీసులను కించపరుస్తూ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.