VIDEO: మోకాళ్లపై కూర్చొని ఓటర్లను వేడుకున్న అభ్యర్థి
HYD: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు నమ్మి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మోసం చేసిందని స్వతంత్ర అభ్యర్థి ఆస్మా అన్నారు. ఈ మేరకు ఆదివారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మోకాళ్లపై కూర్చొని ఓటర్లను వేడుకున్నారు. 'దయచేసి కాంగ్రెస్‌ను ఓడించండి.. మాకు జాబ్స్ వచ్చేలా చూడండి' అంటూ స్థానికులను కోరారు.