CPGET 2025: ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల
TG: MED, MPED కోర్సుల్లో ప్రవేశాల కోసం TG CPGET-2025 ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగ రెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, 25న వెరిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 28న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 30 లోపు తమ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.