చికిత్స పొందుతూ లైన్‌మెన్ మృతి
NLR: విద్యుత్ మరమ్మతులు చేస్తూ గాయపడి నెల్లూరులో వైద్య చికిత్స పొందుతున్న లైన్‌మెన్ మృతి చెందారు. ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామ విద్యుత్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న విజయ్ ఇటీవల విధి నిర్వహణలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ ప్రమాదానికి గురై నెల్లూరులో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. విజయ్ మృతికి విద్యుత్ శాఖ సిబ్బంది సంతాపం తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.