సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
WGL: సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.