నర్సంపేట 85.21%, వర్ధన్నపేట 86.23% పోలింగ్ నమోదు
WGL: నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో నేడు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేటలో 85.21 శాతం, వర్ధన్నపేటలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది.నర్సంపేటలో 40,968 ఓటర్లలో 34,908 మంది, వర్ధన్నపేటలో 10,526 ఓటర్లలో 9,077 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.