తిరుపతిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

తిరుపతిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

తిరుపతి కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్‌వో జీ. నరసింహులు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హస్తకళల కార్పొరేషన్ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.