కొనుగోళు కేంద్రాల్లో సమస్యలపై రైతు సంఘం వినతి

కొనుగోళు కేంద్రాల్లో సమస్యలపై రైతు సంఘం వినతి

NLG: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు గురువారం కలెక్టరేట్‌లో వినతిని అందించారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు ప్రారంభం కాక రాశుల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో క్వింటాలుకు 5-10 కిలోల వరకు కోత విధిస్తున్నారని వాపోయారు.