వినాయక పందిళ్ళ నిర్వాహకులకు సూచనలు

ELR: ఆగిరిపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ ఆవరణములో వినాయక నవరాత్రుల పందిళ్లు ఏర్పాటు చేసే నిర్వాహకులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్సై శుభశేకర్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి పందిళ్ళ వద్ద శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోవాలన్నారు. పందిళ్ళ వద్ద పరిశుభ్రత, సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అవాంఛనీయ సంఘటనలు చెలరేగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.