బసంపల్లిలో ఘనంగా మారెమ్మ జాతర

ATP: శెట్టూరు మండలం బసంపల్లిలో మారెమ్మ జాతరను గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరిలి వస్తున్నారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాతరలో భాగంగా ప్రజలు తమ వాహనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.