చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య
MDK: పెద్ద శంకరంపేట మండలం బూరుగుపల్లికి చెందిన నీరుడి అనిల్ (29) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బూరుగుపల్లికి చెందిన అనిల్ నిన్నపెద్ద శంకరంపేట సంతలో డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురైన అనిల్ తిరుమలాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు శవం లభించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.