పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 14 మంది అరెస్ట్

NZB: జిల్లా డిచ్‌పల్లి మండలం లింగ సముద్రం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 1.61 లక్షల రూపాయల నగదు, 14 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై షరీఫ్ తెలిపారు.