ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరుతుంది: భీమ్ భరత్
RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలో కనకమామిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఇవాళ ప్రారంభించారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, నాయకులు పాల్గొన్నారు.