VIDEO: సూళ్లూరుపేటలో ప్రమాదకరంగా బిల్డింగ్
TPT: సూళ్లూరుపేటలోని పాత మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ప్రమాదకరంగా ఉంది. తహసీల్దార్, ఇతర అధికారులు కొత్త బిల్డింగ్లో పనిచేస్తున్నారు. వీఆర్వోలు ఇతర క్షేత్రస్థాయి అధికారులు పాత బిల్డింగ్లో సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇదే భవనంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. అధికారులు భవనాన్ని కూల్చివేయాలని పలువురు కోరారు.