డిసెంబ‌ర్ 16న IPL వేలం

డిసెంబ‌ర్ 16న IPL వేలం

IPL 2026 మినీ వేలంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రిటెన్షన్ గడువుకు ముందే వేలం తేదీ, వేదికలు ఖరారయ్యాయి. ఈసారి కూడా గల్ఫ్ దేశంలోనే ఆక్షన్‌కు IPL పాలక మండలి ఆమోదం తెలిపింది. ఫ్రాంచైజీ య‌జ‌మానులు సైతం ఓకే అన‌డంతో అబుధాబీలో డిసెంబ‌ర్ 16న క్రికెట‌ర్ల‌పై నోట్ల వ‌ర్షం కురువ‌నుంది. కాగా, 2023లో దుబాయ్, 2024 జెడ్డాలో వేలం వేశారు.