అంగడి యజమానుల నిర్లక్ష్యం..!
KRNL: ఆదోని మండిగిరి పంచాయతీ పరిధిలో తిరుమల నగర్ జేబీ గార్డెన్స్ వద్ద పారిశుధ్య సిబ్బంది రోడ్డు పక్కన చెత్తకు నిప్పు పెట్టగా, అందులో పక్కనే ఉన్న పీఓపీ అంగడి వారు నిత్యం పారబోసే వ్యర్థాలు ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ మంటలు పక్కనే ఉన్న పెద్ద వేపచెట్టుకు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.