నంద్యాలలో మృత్యువుకు దగ్గరగా కాలనీవాసులు

KDP: మైలవరం మండలం దొమ్మర నంద్యాల శివాలయం వీధిలోని కరెంట్ స్తంభం నేల రాలడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు 10 సంవత్సరాలుగా ఈ స్తంభం ఇలాగే ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, స్తంభాన్ని మార్చాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.