వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గణేశ్ రెడ్డి
W.G: వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన యువనేతకు కీలక పదవి లభించింది. సత్యవరం గ్రామానికి చెందిన తమనంపూడి సూర్య వెంకట గణేశ్ రెడ్డిని వైసీపి రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల ఆచంట నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.