VIDEO: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

PLD: నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గేట్ల నుంచి పడుతున్న జలపాతాలను చూస్తూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో సాగర్ గేట్లు పూర్తిగా ఎత్తడం ఇది నాలుగోసారి.