VIDEO: రోడ్డుపై పడ్డ కరెంటు స్తంభం.. తప్పిన పెను ప్రమాదం
ADB: భారీ ఈదురు గాలులతో కరెంటు స్తంభాలు, భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. బోథ్ నుండి మర్లపెళ్లి వైపు రహదారిపై స్థానిక హెచ్.పీ గ్యాస్ దగ్గర భారీ వృక్షం, కరెంటు స్తంభం రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి విద్యుత్తు నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.