జీతాల్లో అవకతవకలు.. విచారణకు ఆదేశం
NDL: ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాల్లో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన గత ఐదేళ్ల జీతాల్లో సుమారు రూ.1.5 కోట్ల అవకతవకలు జరిగినట్లు సమాచారం. జిల్లా, సబ్ ట్రెజరీల సీనియర్ అకౌంటెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.