'వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయన్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు.