రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. మృతుని వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉండగా.. టీ షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించి జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.