వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

ములుగు జిల్లా కేంద్రాలో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 10వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందని తెలిపారు.