లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: నరసాపురం మండలం కొత్త నవరసాపురం, పాత నవరసాపురం గ్రామాలలో ప్రతినెల 1వ తేదీన అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.