VIDEO: ఏరియా హాస్పిటల్‌కు వెళ్లే రహదారి మూసివేత
SKLM: నరసన్నపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా ఫ్లైఓవర్ వంతెన పనుల జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో హాస్పిటల్‌కు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. బయటి నుంచి వచ్చే రోగులు, వారి బంధువులు నేతాజీ వీధి, ఊన్న వారి వీధి, నాయుడు వీధి మీదుగా ఆసుపత్రికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ మార్పు కొద్ది రోజులపాటు కొనసాగనుంది.