ఈనెల 18న పెనుకొండలో ట్రాక్టర్ ర్యాలీ

సత్యసాయి: పెనుకొండలో సోమవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మంత్రి సవిత క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించినందుకు గాను పెనుకొండలోని వై జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని, రైతులు పాల్గొనాలని కోరారు.