మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

VZM: వినాయక చవితి సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భోగాపురంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయకుల ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుతూ, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రాంబాబు, శ్రీను, సుధాకర్ పాల్గొన్నారు.