వీధికుక్కల దాడిలో 15మందికి గాయాలు

వీధికుక్కల దాడిలో 15మందికి గాయాలు

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని 8వ వార్డులో వీధి కుక్కలు స్వైరవిహారం సృష్టించాయి. ఆదివారం ఉదయం వార్డులోని 15 మందిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయని స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని పట్టణవాసులు వాపోతున్నారు. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.