7 నిమిషాల్లో రెండు సార్లు భూ ప్రకంపనలు

గుజరాత్ కచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. 7 నిమిషాల వ్యవధిలో భూమి రెండు సార్లు కంపించినట్లు స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో భూమి తొలిసారి కంపించినట్లు అధికారులు గుర్తించారు. 7 నిమిషాల తర్వాత మరోసారి భూప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. రెండు సార్లు భూకంపం రావడంతో ప్రజలు ఆందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.