హుకుంపేటలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు
ASR: హుకుంపేట మండల కేంద్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వెనుక గ్రామకంఠం స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందని గిరిజన సంఘాలు, అఖిల పక్షం నాయకులు ఆరోపించారు. బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ ఉద్యోగి ఈశ్వర్‌రావు నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకొని నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఏవో సన్యాసిరావులకు గురువారం వినతిపత్రం అందజేశారు.