ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన
AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ ఛైర్మన్ నారాయణ, కార్యదర్శి రమణ మాట్లాడుతూ.. గత పది రోజులుగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.