క్యూఆర్ కోడ్ తో నకిలీ మధ్యానికి చెక్

క్యూఆర్ కోడ్ తో నకిలీ మధ్యానికి చెక్

ELR: ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగంతో నకిలీ మద్యం అమ్మకాలను పూర్తిగా అరికట్టినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఏ. మస్తానయ్య తెలిపారు. నూజివీడులో ఆయన శనివారం రాత్రి మాట్లాడుతూ.. ప్రతి మద్యం సీసాపై క్యూఆర్ కోడ్‌ను ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉన్నదన్నారు. క్యూఆర్ కోడ్‌తో మద్యం సీసాల నాణ్యత తెలుసుకోవచ్చన్నారు.