కావలి ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభమయ్యేది ఎన్నడో?
నెల్లూరు: కావలిలో 2018లో టీడీపీ హయాంలో మొదలైన ఇండోర్ స్టేడియం పనులు వైసీపీ రాకతో నిలిచిపోయాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావలి, ఆత్మకూరు క్రీడాప్రాంగణాల అభివృద్ధికి రూ.2.68 కోట్లు మంజూరు చేసినట్లు 4 నెలల క్రితం ప్రకటించినా, ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న పనులు పూర్తి కాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.