VIDEO: 'పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందాలి'
NGKL: పేద విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అమరేందర్,ఎమ్మార్వోలు, మండల విద్యాశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి 45 రూపాయలకు మించి వసూలు చేయకూడదని సూచించారు.