మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరణ పనులు

మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరణ పనులు

NTR: పెనుగంచిప్రోలు మున్నేరుపై వరద నీరు రెండు అడుగుల మేర తగ్గడంతో బ్రిడ్జిపై రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు. పంచాయతీ కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యంలో సిబ్బంది బ్రిడ్జిపైకి కొట్టుకొచ్చిన చెత్త బురద మట్టిని తొలగిస్తున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.