VIDEO: చిప్పగిరిలో గోవుల అక్రమ రవాణా
KRNL: చిప్పగిరి మండల కేంద్రంలో శనివారం అక్రమంగా కళేబరాలకు తరలిస్తున్న గోవులను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని రక్షించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కార్యకర్తలు గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి గోవులను కాపాడారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.