ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
మెదక్: విశ్వకర్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జీ మంత్రి వివేక్ వెంకటస్వామి విశ్వకర్మ దేవుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ సుహాసిని రెడ్డి, అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.