బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు

KRNL: వినుకొండలో హత్యకు గురైన దివంగత రషీద్ కుటుంబాన్ని వైసీపీ స్టేట్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, కర్నూలు మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, పీఎస్ ఖాన్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రషీద్ తండ్రి ఫారిసా కూడా మరణించడం చాలా బాధాకరమన్నారు. రషీద్ కుటుంబానికి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.