జగన్ హెలికాప్టర్‌కు ఆటంకం

జగన్ హెలికాప్టర్‌కు ఆటంకం

AP: మాజీ సీఎం జగన్ హెలికాప్టర్‌కు ఆటంకం కలిగింది. రెండు రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించారు. పర్యటన ముగియడంతో ఇవాళ బెంగుళూరు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో ఆయన పులివెందుల నుంచి బయల్దేరారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత మార్గమంతా పొగ మంచుతో నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి పులివెందులకు హెలికాప్టర్ తీసుకొచ్చారు.